Type Here to Get Search Results !

అబ్బుర పరిచే జల సోయగాలు రాయికల్ జలపాతాలు.

0

చుట్టూ పచ్చని చెట్లు..  ఎత్తైన కొండలు..
ప్రకృతి ఒడిలో కొండల మీద సహజసిద్ధంగా పుట్టిన జలపాతాలు.
అవే రాయికల్ గ్రామ సరిహద్దులోని జలపాతాలు .
మన పక్కనే ఉన్నా , మనం గుర్తించని అద్భుత అందాలు.
కన్ను ఆర్పకుండా చూసే  ఆ నీటిసిరుల అందం ఈ జలపాతాల సొంతం.
కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని రాయికల్ అనే గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతాలు ఇవి .

వరంగల్ జిల్లా  కేంద్రానికి 43 కిలోమీటర్ల  దూరంలో వరంగల్ అర్బన్ కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది .  ఇంతకాలం
బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉంది ఈ అత్యద్భుత జలపాతం.
జలపాతాన్ని చేరుకోగానే  చుట్టుప్రక్కల ఆవరించి ఉన్న దట్టమైన అడవులను , చెరువు ను , ప్రకృతి  సౌందర్యాన్ని చూసి పరవశించవచ్చు, ఆస్వాదించొచ్చు. ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం ఇది. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఇది  ఒకటి. ప్రచారానికి దూరంగా, కేవలం స్థానికులే సేదతీరే ప్రాంతంగా ఈ జలపాతం ఇన్ని రోజులు  మిగిలిపోయింది.
చుట్టూ పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత మధ్య ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాలు ముఖ్యంగా వర్షాకాలంలో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు. ఇవి తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదక్కడ.
170   అడుగుల ఎత్తు నుండి  స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో..  పరవళ్లు తొక్కుతూ
జలపాతం కిందికి దూకుతుంటుంది 
5  అంచెలలో సహజ సిద్ధమైన జలపాతాలను కలిగిన ఈ సుందర ప్రదేశం,
పర్యాటకులకు , ప్రకృతి  ప్రేమికులకు మధురానుభూతిని పంచుతూ.. ఎనలేని ప్రకృతి సౌందర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని మళ్లీ మళ్లీ రారమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు  ఉదృతంగా  జలపాతం ప్రవహిస్తూ ఉంది .   సాగిపోతున్న కొండకోనల మధ్య పచ్చని ప్రకృతి ప్రాంతమే ఇది. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే ఈ అందమైన దీనికి ఎగువన, దిగువన జలపాతాల హోరు నిరంతరాయంగా వినిపిస్తుంటుంది. ఈ జలపాతాల నీరు తూర్పు  దిక్కుగా ప్రవహిస్తుంటుంది.

ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే కాలినడకన కొంత దూరం గుట్టలమీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇంతకు మించిన చక్కటి ప్రదేశం వరంగల్ కి సమీపంలో  లేనే లేదని చెప్పవచ్చు.
ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే ముందుగా ఓ చిన్న చెరువు దర్శనమిస్తుంది. దీని నుంచే దట్టమైన అటవీ ప్రాంతం మొదలవుతుంది. కొండలమీదుగా
ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి ఎలాంటి సౌకర్యాలు ఉండవు.
పర్యాటకులకు ఏమి కావాలన్నా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది.

Telangana Tourism పర్యాటక స్థలంగా మార్చడానికి  అవకాశం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలపాతం మళ్లీ జీవం పోసుకుంది .
వారాలుగా వరంగల్ నగరానికి అత్యంత సమీపంలో ఉండటం మూలాన ఈ జలపాతాలను పర్యాటక స్థలంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది
            

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఈ జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం, సందర్శకుల నిర్లక్ష్య ధోరణి వెరసి ఆహ్లాదంగా, ఆనందంగా సాగాల్సిన పర్యటన చివరికి విషాదాంతమవుతుంది.

*కొండల  పై భాగంలో  ఎలుగుబంట్లు ఉన్నాయి. కాబట్టి పైకి  వెళ్లే ప్రయత్నం చేయకుండా      ఉంటే మేలు .
* మద్యం తాగివెళ్లొద్దు.
* ఫొటోల కోసం లోతు ప్రాంతాల దగ్గరకు వెళ్లొద్దు.
* జలపాతాలు ఎక్కే  ప్రయత్నం చేయకూడదు.
*శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు వేసుకోవడం మంచిది .
కాళ్లకు పాదరక్షలు వీలైతే    shoes   మరీ మంచిది .
ఆహార పానీయాలను పర్యాటకులు తమ వెంట తీసుకెళ్లడం బెటర్ ఎందుకంటే అక్కడ ఏమీ కూడా లభించవు .

చేపట్టాల్సిన భద్రత చర్యలు:

* నీళ్లలో ప్రమాదవశాత్తు పడితే బయటపడేందుకు ఇరువైపులా తాళ్లతో ఏర్పాటు చేయాలి.
* జలపాతాల వద్ద తగిన సంఖ్యలో భద్రత సిబ్బంది నియామకం.
* నిఘా కోసం సీసీ కెమెరాల ఏర్పాటు.
* నీళ్లలోకి వెళ్లకుండా ఇరువైపులా జాలీ ఏర్పాట్లు.

Route details :

హుస్నాబాద్ - సిద్దిపేట రోడ్ లో ములుకనూరు వద్ద కుడి వైపు వెళ్లాలి.
మాజీ ప్రధానమంత్రి పీవీ . నరసింహారావు స్వగ్రామం అయిన వంగర మీదుగా రాయికల్  గ్రామానికి వెళ్ళాలి.
గ్రామం నుండి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గ్రామ చెరువు వస్తుంది.
అక్కడ వాహనాలను నిలిపి , జలపాతాల వైపు సుమారు 1 1/2 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్  చేస్తూ జలపాతాలను చేరుకోవాలి.

Location details :
Rayikal Waterfalls
Rayikal, Telangana 505480

https://goo.gl/maps/2ydWuRNneSS2

ఇటీవల డెక్కన్ క్రానికల్   Deccan Chronicle
ఆంగ్ల దినపత్రికల్లో ఈ జలపాతాన్ని గురించిన కథనం వచ్చిన తర్వాత అనేక మంది సందర్శకులు ఈ జలపాతాన్ని సందర్శిస్తున్నారు .ఈ ప్రాంతం అటవీ ప్రాంతంలో ఉండటం మూలాన ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి గాను అటవీ సంరక్షణాధికారి అక్బర్ గారు ఇతర అటవీ అధికారులు నిన్న ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది .

రాయికల్ గ్రామంలో నిజాం కాలం నాటి పోలీస్ స్టేషన్ భవనం ఉంది . ఆసక్తి గలవారు చూడవచ్చు. 28 , 29 ,30 Photos .

pictures  courtesy : Anudeep Ceremilla .
Aravind Arya Pakide .

Presents by:- Sathyam patel.olapu

Tags

Post a Comment

0 Comments