Type Here to Get Search Results !

telangana metlabavulu

0

తెలంగాణ మెట్లబావులు

మెట్లబావులంటే వాటిలో వున్న నీళ్ళను చేరడానికి మెట్లుకట్టిన బావులు లేదా కొలనులు. 
పసులను కట్టి తాడుతో బొక్కెనను లాగించేబావులో, లేక చక్రానికి పాత్రలు కట్టి బంతికట్టించి పసులను తిప్పే రాట్నం బావులో(నేమి,త్రికాలు) వ్యవసాయానికి వాడేవారు. మంచినీటి కొరకు చేదబావులను వాడుకునేవారు. నీటికరువు నుండి కాపాడే జలవనరులుగా బావులను తవ్వించేవారు పూర్వీకులు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఖురాన్, బైబిల్, విజ్ఞానశాస్త్రగ్రంథాలు నీరు ఎంత గొప్పదో చెప్పాయి. పాంచభౌతికమైన ఈ ప్రకృతిలో నీటిది విశిష్టస్థానం. మన భూమ్మీద, మన శరీరంలో 70శాతాన్ని మించి నీరుంది. నీరే మనకు ప్రాణం. నీరు లేనినాడు ఈ సృష్టి జరిగివుండేది కాదు. మానవపరిణామం జరిగేది కాదు. నీటివనరులున్న చోటనే మానవజీవన పరిణామం, సాంస్కృతికవికాసం జరిగింది. అందుకే మానవచరిత్రంతా నదీలోయ నాగరికతే.
నీరు అనంతం అని భావిస్తాం. కాని భూగర్భజలాలు మన దేశపు ఉష్ణోగ్రతలకు ఆవిరైపోతుంటాయి. విపరీతంగా వాడుకుంటున్న ఆధునిక మానవజీవనవిధానం వల్ల కూడా నీటివాడకానికి, నీటివనరులకు పొంతన కుదరడం లేదు. జలసరంక్షణ ఒక్కటే నీటికరువునుండి కాపాడే వ్యూహం. పూర్వకాలంలో మనదేశంలో నీటివరదలు, కరువులు సాధారణం. వానకురిసినపుడు నీటిని కాపాడే పద్ధతులే మహోపకారకారమైనవి. బావులు నీటిని కూడబెట్టుకునే జలనిధులు. రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణవేదాలలో నీటిని నిలువచేసే పద్దతులు, వాటికి పేర్లు వున్నాయి. రుగ్వేదంలోని అవత అన్న మాటకు బావి అని అర్థం. యజుర్వేదంలో కుల్య, సరసి పదాలు కనిపిస్తాయి. అథర్వవేదం నదులను, వాటికి తీసిన కాలువలను ఆవు,దూడలు అంటుంది. జైమినీయ బ్రాహ్మణం బావుల తవ్వకం గురించి వివరిస్తుంది.
ప్రాచీనులు సమాజానికి నీరివ్వడానికి ప్రాప, కూప, వాపి, కుల్య, పద్మాకర, తటాకాల నిర్మాణం సప్తసంతానా(తటాకనిర్మాణం, ధనసహాయం, అగ్రహార ప్రతిష్ట, దేవాలయ ప్రతిష్ట, వనప్రతిష్ట, ప్రబంధరచన, స్వసంతానం) లలో ఒకటిగా భావించారు. 
నేమి,త్రికాలంటే నీళ్ళెత్తే రాట్నం వంటి దారుయంత్రంతో వున్న బావి. పుష్కరిణీ అంటే చతురస్రంగా తవ్వబడిన గుంట లేదా కోనేరు, దేవఖాతమ్ అంటే దేవతలచే తవ్వబడ్డ నీటిగుంట(సహజంగా ఏర్పడ్డ నీటిగుంట), పద్మాకర అంటే తామరలున్న కొలను, వాపీ అంటే మెట్లబావి లేదా నడబావి, అన్ధు, ప్రహి, కూపమంటే బావి అని, హ్రద మంటే అఖాతమైన నీటికొలను,జలాశయం అని అర్థం. తటాకమంటే చెరువు. కుల్యమంటే నీటికాలువ.
తొలి మెట్లబావి సింధూనదిలోయ నాగరికతకు నిలయమైన హరప్పా-మొహంజెదారో నగరాల తవ్వకాల సమయంలోనే బయటపడ్డది. సింధూప్రజలు నీటిని దాచుకునే మంచి విధానాలను అమలు పరిచారు. డోలావీరా, మొహంజెదారోలలో ఇటుకలతో కట్టిన మంచినీటి చేదబావులు బయటపడ్డాయి. చిన్న కొండలపై గుహల్లో ఏర్పడ్డ నీటిగుండాలకు రాతిమెట్లు తొలిచిచేసిన మెట్లబావి జునాగఢ్ లోని ఉపర్కోట్ గుహల్లో వుంది. ఇది స్నానవాటిక నిర్మాణాన్ని కలిగివుంది.4వ శతాబ్దానిది కావచ్చని చరిత్రకారుల భావన. క్రీ.శ. 200-400 సం.లలో పశ్చిమ క్షాత్రపుడో, మైత్రకు(క్రీ.శ.600-700)డో కట్టించినదని భావిస్తున్న మెట్లబావి వృత్తాకారపు సోపానాలతో వుంది. అట్లనే రాజ్ కోట్ జిల్లా ధాంక్ లో మెట్లబావులు, భిన్మాల్ లోని సరస్సులు క్రీ.శ.600లలో కట్టబడినవిగా భావిస్తున్నారు. గుజరాత్ లో 11వ శతాబ్దిగా భావించబడే ‘మాతా భవాని’ మెట్లబావి బహుళ అంతస్తులతో, తూర్పు, పడమర ద్వారాలతో, శిల్పశోభితంగా వుంది. మొఘల్ రాజులు కూడా ఈ మెట్లబావుల నిర్మాణాలను ప్రోత్సహించారు. బ్రిటిష్ వారు వారి సౌకర్యార్థం వాటినుండి నీరు తోడుకోవడానికి గొట్టాలను ఏర్పరుచుకున్నారు. దానితో నీళ్ళుతోడే వేగానికి నీళ్ళు వూరే వేగానికి పొంతన కుదరక భూగర్భజలాలు అడుగంటిపోయి బావులు ఎండిపోయాయి.
గుళ్ళవద్ద, ప్రత్యేకమైన ప్రదేశాలలో బావులను తవ్వించి వాటికి వివిధ వైవిధ్యభరితమైన శిల్పవాస్తుతో మెట్లు కట్టించిన బావులు పశ్చిమభారతదేశంలో ఎక్కువ. దక్షిణాసియాలో కూడా పాకిస్తాన్ వంటి దేశాల్లో మెట్లబావులు విరివిగానే అగుపిస్తాయి. నీటి నిలువలతో, తాగునీరు, సాగునీరు సదుపాయాన్నిచ్చే ఈ బావులు మనదేశంలో భూగర్భజలాలను దాచుకున్న నీటిభాండాలు. సంవత్సరమంతా నీరందించే విధంగా భూమిలో లోతుగా తవ్వి అందమైన డిజైన్ల రాళ్ళ కట్టడాలతో అలంకరించిన ఈ వాపీ, కూపాలు అంటే దిగుడు, (నడ)బావులు, గొట్టంబావులు. ప్రజలకు తాగడానికి, స్నానాదికాలకు, పొలాలకు నీరందించడానికి, దేవాలయాల వద్ద పుష్కరిణులనేబడేవి దేవాలయ కార్యాలకు ఉపయోగించబడుతుంటాయి. మంచినీటి బావులైనా, దిగుడుబావులైనా ప్రజలు సామూహికంగా కూడడానికి, మతసంబంధ ఉత్సవాల సందర్భాలకు వాడుకోబడుతుంటాయి. బావిని దేవతగా భావించి, పూజించి ఆ దేవత దీవెనలను కోరి పండుగలు కూడా చేస్తుంటారు. ఇవన్నీ నీళ్ళకు, నీళ్ళను సేకరించే స్త్రీలకున్న జీవనబాంధవ్య క్రతువులే. బావులను పూజించేటపుడు స్త్రీలు బావికి దేవుళ్ళకు చేసినట్లే పూజలు చేస్తారు. నైవేద్యాలు పెడతారు. దీవెనలను అర్థిస్తారు. నీళ్ళ బాధ్యతలు స్త్రీలకే కేటాయించింది సమాజం. సర్వోపకారి, లోకోపకారి, మానవప్రేమి స్త్రీమూర్తితో మెట్లబావుల అనుబంధం సనాతనమైనది. అందువల్ల కావచ్చు బావులను అందంగా అలంకరించే సంప్రదాయం మొదలైంది.
చక్కని నిర్మాణవాస్తుతో, అందమైన శిల్పాల అలంకరణలతో చేదబావులు, దిగుడుబావులు తీర్చిదిద్దబడ్డాయి. ఇట్లాంటి మెట్లబావులు ఎక్కువగా దేవాలయాలతో ముడిపడివున్నాయి. దేవాలయాలవద్దనైతే దేవాలయాలకున్నట్లే రాతిస్తంభాలతో, లతలు, హంసలు, మదాలసలు, చక్కని స్త్రీ,పురుష దేవతల శిల్పాలతో ఈ మెట్లబావులు నిర్మించబడ్డాయి. రాజుల కోటలలో స్నానవాటికలుగా, జలవిహార వేదికలుగా కూడా ఈ
మెట్లబావులు కట్టబడ్డాయి. మెట్లబావులు కరువులో నీరిచ్చే జలదేవతలే కాదు, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక ప్రాధాన్యత కలిగివున్నాయి. ఈ బావులను ధార్మికకార్యాలు, ప్రార్థనలు, నివేదనలకు కూడా అన్ని మతాలవారు ఉపయోగిస్తుంటారు.
సాధారణంగా ఈ మెట్లబావులు నిలువుగా సిలిండర్లవలెనె తవ్వబడిన పిదప వదిలివేయబడకుండ అంచులకు విస్తరించిన అంతస్తుల వేదికలకు క్రమంగా కిందికి దిగుతున్న మెట్లు అమర్చబడి, నాలుగువైపులా మంటపాలు, గదులు అమరివుంటాయి. భూకంపాలకు చెదిరిపోని, కూలిపోని ప్రత్యేక నిర్మాణాలు ఈ మెట్లబావులు. దాదాపు 10వేలకు పైగా మెట్లబావులను దేశమంతటి నుండి గుర్తించడం జరిగింది. ఈ బావులు రెండురకాలు. ఒకటి దేవాలయాలకు అనుబంధంగా తవ్విన కోనేర్లకు మెట్లు కట్టినవి. రెండు జనసమ్మర్దాలకు దూరంగా నిర్మించిన మెట్లబావులు జలవిహారాలకు అనువుగా దీర్ఘచతురస్రాకారంలో, వృత్తాకారంలో, ఎల్ ఆకారంలో చక్కని మెట్లు, అంతస్తుల మంటపాలతో వుంటాయి. కొన్నిచోట్ల ఈ మెట్లబావులు భూమిలోకి మునిగిపోయిన బహుళ అంతస్తుల భవానాలను గుర్తుకు తెస్తున్నాయి. ఈ బావులు క్షితిజసమాంతర స్థితినుండి బావిలోని నీటిని చేరేవరకు కట్టిన మెట్లు, అంతస్తులవారీగా మంటపాలు, అలంకృత శిల్పకళతో మెరిసిపోతున్నాయి.
ఈ నిర్మాణాలు ఇండియన్ ఆర్కిటెక్చర్ కు కొద్దిగానే తెలిసిన కట్టడాలు. హిందూశైలి స్తంభాలు,అడ్డదూలాలతో, ఇస్లాం గుమ్మటం, ఆర్చి వాస్తురీతులలో ఈ బావుల ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. వీటి గురించి ఎక్కువగా చెప్పబడలేదు. కొంతమంది పాలకుల కాలంలోనే మెట్లబావులు ప్రత్యేకంగా తయారుచేయబడ్డాయి. కొందరి కాలంలో పాతబావులు పునరుద్ధరించబడ్డాయి. ఆగ్రాలోని రాంబాగ్ లో తొలి మొఘల్ గార్డెన్లో బాబర్ తవ్వించి మెట్లు కట్టించిన పొడవైన పెద్ద కొలను వుంది. తర్వాత అన్ని మొఘల్ గార్డెన్లలో ఈ మెట్లబావినే అనుసరించారు.
బావులను హిందీలో బావ్లీ, బౌడి, రాజస్తానీలో బావ్ డి లేదా బావురి,బావోలి,మరాఠిలో బారవ్, గుజరాతీలో వావ్,వవ్ అని, కన్నడలో కళ్యాణి,పుష్కరిణి అని, తెలుగులో బావి అని పిలుస్తారు.
ఈ మెట్లబావులు ఆధునికత కారణంగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ప్రదూషిత ప్రదేశాలై పోయాయి. ప్రజలు, ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో మెట్లబావుల జలకళ మాసిపోయింది. నీళ్ళు అడుగంటిపోయాయి. అవన్నీ గతచరిత్రల శిథిలావశేషాలై కుట్టుసురుతో వున్నాయి. బ్రిటిష్ పాలనలో మొదలైన ఉదాసీనత ఆ బావులను చెత్తకుండీలుగా మార్చివేసింది. ప్రజలు నీటికొరతతో అల్లాడుతున్నా భారతప్రభుత్వం కూడా వీటిని తిరుగతోడాలనుకోక పోవడం విచారణీయం.
మొదటితరం మెట్లబావులు క్రీ.పూ.3శతాబ్దంలో నిర్మించబడ్డవని చరిత్రకారులు భావిస్తున్నారు.
పశ్చిమోత్తర భారతంలో ఏడాదంతా మానవుల నీటిఅవసరాలను తీర్చే నిమిత్తం 10 అంతస్తుల లోతుదాకా బావులను తవ్వించారు. రానురాను ఈ బావులు అద్భుత నిర్మాణ కౌశలాలకు, విశిష్ట శిల్పశోభలకు పెట్టిందిపేరుగా కట్టబడ్డాయి. ఈ మెట్లబావులు ముఖ్యంగా బాటసారుల దారులకు, సార్థవాహుల ప్రముఖ వ్యాపారమార్గాలకు చేరువగా కట్టించబడ్డాయి. ఈ బావులు శాశ్వతత్వానికి భూబద్ధంగా కట్టిన దుర్గాల వంటివి. ఇవి ప్రజల జలకీర్తి మందిరాలు. అన్ని మతాలవారికి, లింగభేదం లేకుండా మనుషులందరికి అందుబాటులో వుండే పవిత్ర జలమందిరాలు. బాటసారులు ఈ బావుల వద్ద తమ బిడారాలను దించుకొని, గుడారాలను కట్టుకుని, తాము, తమవెంట తెచ్చుకున్న జంతువులు కడుపారా నీళ్ళు తాగడానికి వాడుకున్న జలధనకోశాలు.
దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ఎనిమిది అంతస్తులతో,రాజభవనంవంటి నిర్మాణంతో వున్న ‘రాణీ కీ వావ్’, రాజస్తాన్ రాష్ట్రంలోని అభనేరిలో ‘చాంద్ బవోరి’ మెట్లబావులు ప్రపంచప్రసిద్ధమైనవి. ఈ మెట్లబావులతో పోల్చదగినవి, మనతెలంగాణాలో వున్న మెట్లబావులు కూడా ప్రత్యేక నిర్మితి కలిగినవే. దేవాలయాలున్న చోట్లలో నిర్మించిన గుడికోనేరులు, పుష్కరిణులున్నాయి. విడిగా కూడా మెట్లబావులున్నాయి. వాటిని పట్టించుకునే నాథులు లేక పూడిపోయినవి, పాడైపోయినవి, చెత్తకుండీలైనవి ఎన్నో.నిజానికి ఈ బావులన్నీ నీటివూటల ఆధారంగా తవ్వించినవే. ఈ బావులను బాగుచేయడమంటే పాతనీటివనరులను కొత్తగా అన్వేషించడమే.ఇట్లాంటి ఊటబావులను ఉద్ధరిస్తే అవి తాగునీటి కొరతను తీరుస్తాయి.లేదా వ్యవసాయబావులుగా వ్యవసాయానికి సాయమందిస్తాయి. వందలాదిగా వున్న మన రాష్ట్రపు బావులలో పునరుద్ధరణకు పనికొచ్చేవి ఎన్నున్నాయో మరి. అయితే మనరాష్ట్రంలో ఎన్నిరకాల మెట్లబావులెన్ని వున్నాయో లెక్కలు లేవు. చారిత్రక పరిశోధనలు జరుగలేదు. ఈ పనులన్నిటిని చేయడానికి పురావస్తుశాఖకు నిధుల కొరత, ఉద్యోగుల కొరత. ఈ విషయంలోనే కాదు, తెలంగాణా చరిత్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వానిదే పెద్దబాధ్యత.
వరంగల్ లోని కాకతీయుల కోటకు సమీపంలో ఒక మెట్లబావుంది.దీర్ఘచతురస్రాకారంలో కట్టబడిన ఈ మెట్లబావికి దేవాలయ స్తంభాలు,అడ్డదూలాలతో నాలుగువైపుల మంటపాలు. మంటపాలనుండి కిందికి మెట్లదారులు.మూడు అంతస్తుల నిర్మాణం.కాకతీయుల కాలంలో కట్టబడిన ఈ మెట్లబావి కుతుబ్షాహీల కాలంలో తిరిగి కట్టినారడానికి సాక్ష్యమిచ్చే ఒక లఘుశాసనాన్ని మా టీమ్ చదివింది.దాంట్లో మిరాసీ ప్రస్తావన వుంది. కుతుబ్షాహీల కాలంలోని మిరాసీలు కాకతీయుల కాలంలో నాయంకరుల వంటి వారు.అక్కడ మరో స్తంభం మీద చెక్కివున్న ఏకపదశాసనంలో ‘మూలసంఘజీ’ పేరుంది. మెట్లబావికి అది మరో యజమాని పేరు కావచ్చు.
కొత్తతెలంగాణా చరిత్రబృందం సందర్శించినపుడు మా సభ్యుడు అరవింద్ ఆర్య ఈ బావి గురించి పత్రికాముఖంగా తెలియజేసాడు. అప్పటినుండి అరవింద్ చేసిన ప్రయత్నాల మూలంగా ఇపుడా మెట్లబావి ఒక పర్యాటకప్రదేశంగా రూపుదిద్దుకుంటున్నది.
ఇలాంటిదే ఇంతకన్నా గొప్ప నిర్మాణం కలిగిన మెట్లబావి పాతమెదక్ జిల్లా ఆందోల్ దగ్గర్లోని కిచ్చనపల్లిలో వుంది. నాలుగు మంటపాలు,మధ్యలో మంటపంతో బోర్లించిన పిరమిడ్ ఆకారంలో బావిమెట్లు. అందమైన శిల్పాలతో ఈ మెట్లబావి అపురూప నిర్మాణం.
యాదాద్రి-భువనగిరి జిల్లాలోని రాయగిరి రైల్వేస్టేషన్ కు ఉత్తరంగా వున్న మైదానంలో అద్భుతమైన చతురస్రాకారపు మెట్లబావి వుంది. ఎకరం నేలలో విస్తరించివుండే ఈబావి ఎదురుగా గుట్టమీదుండే వెంకటేశ్వరదేవాలయానికి పుష్కరిణి.రెండంతస్తులతో వుండే ఈ మెట్లబావి పటిష్టమైన నిర్మాణంతో వుంది.పూర్వం తిరుమలగిరి తండా అని పిలువబడే చోటనే ఇప్పటి రాయగిరి రైల్వేస్టేషన్ వుంది. అక్కడే అనుబంధ ఆలయాలు కూడా వున్నాయి.
నిజామాబాద్ జిల్లా భిక్కనూరు క్షేత్రంలో మూడంతస్తుల మెట్లబావి వుంది.అత్యంత దృఢమైన నిర్మాణం.దీర్ఘచతురస్రాకారంలో కట్టించబడిన ఈ బావిని పునరుద్ధరిస్తే రామలింగేశ్వరాలయానికి శోభ తెస్తుంది.
కామారెడ్డి జిల్లా లింగంపేటలో మెట్లబావుంది. దీనిని పాపన్నపేట సంస్థానాధీశుల ఆదేశాల మేరకు లింగంపేట జక్సానీ నాగయ్య కట్టించాడని స్థానిక కైఫీయతు. 18వ శతాబ్దంలో మూడేండ్లపాటు నిర్మించిన ఈ బావిని ఏనుగులబావి అని పిలిచేవారట. నాలుగు దారులున్న ఈ బావిలో చుట్టూరా కట్టిన 50గదులున్నాయి.అందమైన కళాకృతులున్న శిలలతో ఈ బావిని అలంకరించారు.
భువనగిరిలో త్రిభువనమల్లుని కాలంలో మహాప్రధాన,దండనాయకులుగా తొలుత మల్లచమూపతి తర్వాత అతని కొడుకు విద్ధమయ్య భువనగిరి దుర్గాధిపతులైనారు. విద్ధమయ్య లేదా విద్ధమరసరు భువనగిరికి సమీపంలోని చందుపట్లగ్రామంలో విద్దేశ్వరస్వామిపేర శైవాలయాన్ని నిర్మించాడు. దేవాలయం వెనక కోనేరు తవ్వించి దానికి ‘విద్యాధరతీర్థమ’ని పేరుపెట్టాడు. శాసనం(క్రీ.శ.1115) వేయించాడు. తర్వాత కాలంతో విద్దేశ్వరాలయ సేవలకు చేసిన భూదానం చేసినట్లు రెండవ చందుపట్ల శాసనం(కాలం తెలియదు)తెలియజేస్తున్నది.
భువనగిరిలో మసీదు మెట్లబావి, యాదాద్రిజిల్లాలోని మన్నెవారి తుర్కపల్లిలో వున్న మెట్లబావి, ఈ రెండు ఇస్లామిక్ శైలిలో నిర్మితమైన అందమైన మెట్లబావులు.తుర్కపల్లి మెట్లబావిలోని ఆర్చీలమీద నిజాంరాజ్య చిహ్నం వుండటం విశేషం.
మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల సమీపంలోని గంగాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయప్రాంగణంలోని పుష్కరిణి చక్కటి మెట్లబావికి మంచి ఉదాహరణ.
సిద్ధిపేటజిల్లాలోని దుద్దెడ,గాలిపల్లిలలో చక్కని నిర్మాణాలతో మెట్లబావులున్నాయి.
తెలంగాణాలో ఇటువంటి మెట్లబావుల్నివెతికి వాటి నిర్మాణాలను పరిశోధించడానికి, చరిత్ర రాయడానికి, ‘ది హైదరాబాద్‌ డిజైన్‌ ఫోరం’అధ్యక్షుడు ఆర్కిటెక్టు యశ్వంత్‌ రామమూర్తి ఆధ్వర్యంలో 15మంది ఔత్సాహిక ఆర్కిటెక్టులతో ఒక బృందం పనిచేస్తున్నది. తొలుత జే.ఎన్.టి.యు. విద్యార్థుల సహాయంతో రాష్ట్రంలోని మెట్లబావుల సర్వే చేపట్టారు.సొంతంగానే 70బావుల గురించి డాక్యుమెంటేషన్ చేసారు. మరో 30బావుల గురించి విషయసేకరణ చేస్తున్నారు.వాటిలో నుండి 30 మెట్లబావుల్ని ఎంపికచేసి, అవి ఎప్పటివో శాస్త్రీయంగా తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ ప్రక్రియను చేపడ్తున్నారు. గుజరాత్,రాజస్తాన్ లలోనే కాదు తెలంగాణాలో కూడా అక్కడి మెట్లబావులకు దీటైన బావులున్నాయని నిరూపించడానికి 100మెట్లబావుల విశేషాలతో,ఫోటోలతో ఒక కాఫీటేబుల్ బుక్ తేబోతున్నారు. ఇది తెలంగాణా చరిత్ర నిర్మాణంలో కొత్తకోణం.ఈ ఔత్సాహికులకు రాష్ట్రపురావస్తుశాఖ తనవంతు సహాయాన్ని అందిస్తున్నది. ఈ బృందం చేస్తున్న సర్వేలు,పరిశోధనలు తెలిసిన ఎన్.సాయికుమార్ అనే ఒక సామాజిక కార్యకర్త దేశప్రధాని కార్యాలయానికి రాసిన లేఖకు బదులుగా రాష్ట్రప్రభుత్వానికి వచ్చిన కేంద్రం ఆదేశాలతో రాష్ట్రపురావస్తుశాఖ మెట్లబావుల పరిరక్షణలో పడింది.
వేయ్యేళ్ళ కిందట మెట్లబావులు మనకు ప్రాధమికావసరాలు. ప్రాంతీయపాలకులు సామాజిక శ్రేయస్సుకొరకు వాపీ, కూప, తటాకాలను నిర్మించారు. పదే,పదే కాకతీయులను తలచుకునేది వారు చేసిన యుద్ధాల కన్నా వారు తవ్వించిన చెరువులు, కట్టించిన మెట్లబావులను తలుచుకునే. వేలాది మెట్లబావులు నేడు పూడ్చివేయబడి ఆనవాళ్ళు లేకుండా పోయాయి. కొన్నిశిథిలదేవాలయాలతో పాటు చెత్తకుండీలైపోయాయి. కొన్ని నిరుపయోగంగా పడివున్నాయి. మెట్లబావులను వాటి జలవనరుల కొరకు, వాటి నిర్మాణంలోని సాటిలేని కౌశలానికి గౌరవించి, వాటిని మన వారసత్వసంపదలుగా గుర్తించాలి. కాపాడాలి. పునర్నిర్మాణం 

తెలంగాణ మెట్లబావులు మెట్లబావులంటే వాటిలో వున్న నీళ్ళను చేరడానికి మెట్లుకట్టిన బావులు లేదా కొలనులు. పసులను కట్టి తాడుతో బొక్కెనను లాగించేబావులో, లేక చక్రానికి పాత్రలు కట్టి బంతికట్టించి పసులను తిప్పే రాట్నం బావులో(నేమి,త్రికాలు) వ్యవసాయానికి వాడేవారు. మంచినీటి కొరకు చేదబావులను వాడుకునేవారు. నీటికరువు నుండి కాపాడే జలవనరులుగా బావులను తవ్వించేవారు పూర్వీకులు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఖురాన్, బైబిల్, విజ్ఞానశాస్త్రగ్రంథాలు నీరు ఎంత గొప్పదో చెప్పాయి. పాంచభౌతికమైన ఈ ప్రకృతిలో నీటిది విశిష్టస్థానం. మన భూమ్మీద, మన శరీరంలో 70శాతాన్ని మించి నీరుంది. నీరే మనకు ప్రాణం. నీరు లేనినాడు ఈ సృష్టి జరిగివుండేది కాదు. మానవపరిణామం జరిగేది కాదు. నీటివనరులున్న చోటనే మానవజీవన పరిణామం, సాంస్కృతికవికాసం జరిగింది. అందుకే మానవచరిత్రంతా నదీలోయ నాగరికతే. నీరు అనంతం అని భావిస్తాం. కాని భూగర్భజలాలు మన దేశపు ఉష్ణోగ్రతలకు ఆవిరైపోతుంటాయి. విపరీతంగా వాడుకుంటున్న ఆధునిక మానవజీవనవిధానం వల్ల కూడా నీటివాడకానికి, నీటివనరులకు పొంతన కుదరడం లేదు. జలసరంక్షణ ఒక్కటే నీటికరువునుండి కాపాడే వ్యూహం. పూర్వకాలంలో మనదేశంలో నీటివరదలు, కరువులు సాధారణం. వానకురిసినపుడు నీటిని కాపాడే పద్ధతులే మహోపకారకారమైనవి. బావులు నీటిని కూడబెట్టుకునే జలనిధులు. రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణవేదాలలో నీటిని నిలువచేసే పద్దతులు, వాటికి పేర్లు వున్నాయి. రుగ్వేదంలోని అవత అన్న మాటకు బావి అని అర్థం. యజుర్వేదంలో కుల్య, సరసి పదాలు కనిపిస్తాయి. అథర్వవేదం నదులను, వాటికి తీసిన కాలువలను ఆవు,దూడలు అంటుంది. జైమినీయ బ్రాహ్మణం బావుల తవ్వకం గురించి వివరిస్తుంది. ప్రాచీనులు సమాజానికి నీరివ్వడానికి ప్రాప, కూప, వాపి, కుల్య, పద్మాకర, తటాకాల నిర్మాణం సప్తసంతానా(తటాకనిర్మాణం, ధనసహాయం, అగ్రహార ప్రతిష్ట, దేవాలయ ప్రతిష్ట, వనప్రతిష్ట, ప్రబంధరచన, స్వసంతానం) లలో ఒకటిగా భావించారు. నేమి,త్రికాలంటే నీళ్ళెత్తే రాట్నం వంటి దారుయంత్రంతో వున్న బావి. పుష్కరిణీ అంటే చతురస్రంగా తవ్వబడిన గుంట లేదా కోనేరు, దేవఖాతమ్ అంటే దేవతలచే తవ్వబడ్డ నీటిగుంట(సహజంగా ఏర్పడ్డ నీటిగుంట), పద్మాకర అంటే తామరలున్న కొలను, వాపీ అంటే మెట్లబావి లేదా నడబావి, అన్ధు, ప్రహి, కూపమంటే బావి అని, హ్రద మంటే అఖాతమైన నీటికొలను,జలాశయం అని అర్థం. తటాకమంటే చెరువు. కుల్యమంటే నీటికాలువ. తొలి మెట్లబావి సింధూనదిలోయ నాగరికతకు నిలయమైన హరప్పా-మొహంజెదారో నగరాల తవ్వకాల సమయంలోనే బయటపడ్డది. సింధూప్రజలు నీటిని దాచుకునే మంచి విధానాలను అమలు పరిచారు. డోలావీరా, మొహంజెదారోలలో ఇటుకలతో కట్టిన మంచినీటి చేదబావులు బయటపడ్డాయి. చిన్న కొండలపై గుహల్లో ఏర్పడ్డ నీటిగుండాలకు రాతిమెట్లు తొలిచిచేసిన మెట్లబావి జునాగఢ్ లోని ఉపర్కోట్ గుహల్లో వుంది. ఇది స్నానవాటిక నిర్మాణాన్ని కలిగివుంది.4వ శతాబ్దానిది కావచ్చని చరిత్రకారుల భావన. క్రీ.శ. 200-400 సం.లలో పశ్చిమ క్షాత్రపుడో, మైత్రకు(క్రీ.శ.600-700)డో కట్టించినదని భావిస్తున్న మెట్లబావి వృత్తాకారపు సోపానాలతో వుంది. అట్లనే రాజ్ కోట్ జిల్లా ధాంక్ లో మెట్లబావులు, భిన్మాల్ లోని సరస్సులు క్రీ.శ.600లలో కట్టబడినవిగా భావిస్తున్నారు. గుజరాత్ లో 11వ శతాబ్దిగా భావించబడే ‘మాతా భవాని’ మెట్లబావి బహుళ అంతస్తులతో, తూర్పు, పడమర ద్వారాలతో, శిల్పశోభితంగా వుంది. మొఘల్ రాజులు కూడా ఈ మెట్లబావుల నిర్మాణాలను ప్రోత్సహించారు. బ్రిటిష్ వారు వారి సౌకర్యార్థం వాటినుండి నీరు తోడుకోవడానికి గొట్టాలను ఏర్పరుచుకున్నారు. దానితో నీళ్ళుతోడే వేగానికి నీళ్ళు వూరే వేగానికి పొంతన కుదరక భూగర్భజలాలు అడుగంటిపోయి బావులు ఎండిపోయాయి. గుళ్ళవద్ద, ప్రత్యేకమైన ప్రదేశాలలో బావులను తవ్వించి వాటికి వివిధ వైవిధ్యభరితమైన శిల్పవాస్తుతో మెట్లు కట్టించిన బావులు పశ్చిమభారతదేశంలో ఎక్కువ. దక్షిణాసియాలో కూడా పాకిస్తాన్ వంటి దేశాల్లో మెట్లబావులు విరివిగానే అగుపిస్తాయి. నీటి నిలువలతో, తాగునీరు, సాగునీరు సదుపాయాన్నిచ్చే ఈ బావులు మనదేశంలో భూగర్భజలాలను దాచుకున్న నీటిభాండాలు. సంవత్సరమంతా నీరందించే విధంగా భూమిలో లోతుగా తవ్వి అందమైన డిజైన్ల రాళ్ళ కట్టడాలతో అలంకరించిన ఈ వాపీ, కూపాలు అంటే దిగుడు, (నడ)బావులు, గొట్టంబావులు. ప్రజలకు తాగడానికి, స్నానాదికాలకు, పొలాలకు నీరందించడానికి, దేవాలయాల వద్ద పుష్కరిణులనేబడేవి దేవాలయ కార్యాలకు ఉపయోగించబడుతుంటాయి. మంచినీటి బావులైనా, దిగుడుబావులైనా ప్రజలు సామూహికంగా కూడడానికి, మతసంబంధ ఉత్సవాల సందర్భాలకు వాడుకోబడుతుంటాయి. బావిని దేవతగా భావించి, పూజించి ఆ దేవత దీవెనలను కోరి పండుగలు కూడా చేస్తుంటారు. ఇవన్నీ నీళ్ళకు, నీళ్ళను సేకరించే స్త్రీలకున్న జీవనబాంధవ్య క్రతువులే. బావులను పూజించేటపుడు స్త్రీలు బావికి దేవుళ్ళకు చేసినట్లే పూజలు చేస్తారు. నైవేద్యాలు పెడతారు. దీవెనలను అర్థిస్తారు. నీళ్ళ బాధ్యతలు స్త్రీలకే కేటాయించింది సమాజం. సర్వోపకారి, లోకోపకారి, మానవప్రేమి స్త్రీమూర్తితో మెట్లబావుల అనుబంధం సనాతనమైనది. అందువల్ల కావచ్చు బావులను అందంగా అలంకరించే సంప్రదాయం మొదలైంది. చక్కని నిర్మాణవాస్తుతో, అందమైన శిల్పాల అలంకరణలతో చేదబావులు, దిగుడుబావులు తీర్చిదిద్దబడ్డాయి. ఇట్లాంటి మెట్లబావులు ఎక్కువగా దేవాలయాలతో ముడిపడివున్నాయి. దేవాలయాలవద్దనైతే దేవాలయాలకున్నట్లే రాతిస్తంభాలతో, లతలు, హంసలు, మదాలసలు, చక్కని స్త్రీ,పురుష దేవతల శిల్పాలతో ఈ మెట్లబావులు నిర్మించబడ్డాయి. రాజుల కోటలలో స్నానవాటికలుగా, జలవిహార వేదికలుగా కూడా ఈ మెట్లబావులు కట్టబడ్డాయి. మెట్లబావులు కరువులో నీరిచ్చే జలదేవతలే కాదు, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక ప్రాధాన్యత కలిగివున్నాయి. ఈ బావులను ధార్మికకార్యాలు, ప్రార్థనలు, నివేదనలకు కూడా అన్ని మతాలవారు ఉపయోగిస్తుంటారు. సాధారణంగా ఈ మెట్లబావులు నిలువుగా సిలిండర్లవలెనె తవ్వబడిన పిదప వదిలివేయబడకుండ అంచులకు విస్తరించిన అంతస్తుల వేదికలకు క్రమంగా కిందికి దిగుతున్న మెట్లు అమర్చబడి, నాలుగువైపులా మంటపాలు, గదులు అమరివుంటాయి. భూకంపాలకు చెదిరిపోని, కూలిపోని ప్రత్యేక నిర్మాణాలు ఈ మెట్లబావులు. దాదాపు 10వేలకు పైగా మెట్లబావులను దేశమంతటి నుండి గుర్తించడం జరిగింది. ఈ బావులు రెండురకాలు. ఒకటి దేవాలయాలకు అనుబంధంగా తవ్విన కోనేర్లకు మెట్లు కట్టినవి. రెండు జనసమ్మర్దాలకు దూరంగా నిర్మించిన మెట్లబావులు జలవిహారాలకు అనువుగా దీర్ఘచతురస్రాకారంలో, వృత్తాకారంలో, ఎల్ ఆకారంలో చక్కని మెట్లు, అంతస్తుల మంటపాలతో వుంటాయి. కొన్నిచోట్ల ఈ మెట్లబావులు భూమిలోకి మునిగిపోయిన బహుళ అంతస్తుల భవానాలను గుర్తుకు తెస్తున్నాయి. ఈ బావులు క్షితిజసమాంతర స్థితినుండి బావిలోని నీటిని చేరేవరకు కట్టిన మెట్లు, అంతస్తులవారీగా మంటపాలు, అలంకృత శిల్పకళతో మెరిసిపోతున్నాయి. ఈ నిర్మాణాలు ఇండియన్ ఆర్కిటెక్చర్ కు కొద్దిగానే తెలిసిన కట్టడాలు. హిందూశైలి స్తంభాలు,అడ్డదూలాలతో, ఇస్లాం గుమ్మటం, ఆర్చి వాస్తురీతులలో ఈ బావుల ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. వీటి గురించి ఎక్కువగా చెప్పబడలేదు. కొంతమంది పాలకుల కాలంలోనే మెట్లబావులు ప్రత్యేకంగా తయారుచేయబడ్డాయి. కొందరి కాలంలో పాతబావులు పునరుద్ధరించబడ్డాయి. ఆగ్రాలోని రాంబాగ్ లో తొలి మొఘల్ గార్డెన్లో బాబర్ తవ్వించి మెట్లు కట్టించిన పొడవైన పెద్ద కొలను వుంది. తర్వాత అన్ని మొఘల్ గార్డెన్లలో ఈ మెట్లబావినే అనుసరించారు. బావులను హిందీలో బావ్లీ, బౌడి, రాజస్తానీలో బావ్ డి లేదా బావురి,బావోలి,మరాఠిలో బారవ్, గుజరాతీలో వావ్,వవ్ అని, కన్నడలో కళ్యాణి,పుష్కరిణి అని, తెలుగులో బావి అని పిలుస్తారు. ఈ మెట్లబావులు ఆధునికత కారణంగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ప్రదూషిత ప్రదేశాలై పోయాయి. ప్రజలు, ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో మెట్లబావుల జలకళ మాసిపోయింది. నీళ్ళు అడుగంటిపోయాయి. అవన్నీ గతచరిత్రల శిథిలావశేషాలై కుట్టుసురుతో వున్నాయి. బ్రిటిష్ పాలనలో మొదలైన ఉదాసీనత ఆ బావులను చెత్తకుండీలుగా మార్చివేసింది. ప్రజలు నీటికొరతతో అల్లాడుతున్నా భారతప్రభుత్వం కూడా వీటిని తిరుగతోడాలనుకోక పోవడం విచారణీయం. మొదటితరం మెట్లబావులు క్రీ.పూ.3శతాబ్దంలో నిర్మించబడ్డవని చరిత్రకారులు భావిస్తున్నారు. పశ్చిమోత్తర భారతంలో ఏడాదంతా మానవుల నీటిఅవసరాలను తీర్చే నిమిత్తం 10 అంతస్తుల లోతుదాకా బావులను తవ్వించారు. రానురాను ఈ బావులు అద్భుత నిర్మాణ కౌశలాలకు, విశిష్ట శిల్పశోభలకు పెట్టిందిపేరుగా కట్టబడ్డాయి. ఈ మెట్లబావులు ముఖ్యంగా బాటసారుల దారులకు, సార్థవాహుల ప్రముఖ వ్యాపారమార్గాలకు చేరువగా కట్టించబడ్డాయి. ఈ బావులు శాశ్వతత్వానికి భూబద్ధంగా కట్టిన దుర్గాల వంటివి. ఇవి ప్రజల జలకీర్తి మందిరాలు. అన్ని మతాలవారికి, లింగభేదం లేకుండా మనుషులందరికి అందుబాటులో వుండే పవిత్ర జలమందిరాలు. బాటసారులు ఈ బావుల వద్ద తమ బిడారాలను దించుకొని, గుడారాలను కట్టుకుని, తాము, తమవెంట తెచ్చుకున్న జంతువులు కడుపారా నీళ్ళు తాగడానికి వాడుకున్న జలధనకోశాలు. దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ఎనిమిది అంతస్తులతో,రాజభవనంవంటి నిర్మాణంతో వున్న ‘రాణీ కీ వావ్’, రాజస్తాన్ రాష్ట్రంలోని అభనేరిలో ‘చాంద్ బవోరి’ మెట్లబావులు ప్రపంచప్రసిద్ధమైనవి. ఈ మెట్లబావులతో పోల్చదగినవి, మనతెలంగాణాలో వున్న మెట్లబావులు కూడా ప్రత్యేక నిర్మితి కలిగినవే. దేవాలయాలున్న చోట్లలో నిర్మించిన గుడికోనేరులు, పుష్కరిణులున్నాయి. విడిగా కూడా మెట్లబావులున్నాయి. వాటిని పట్టించుకునే నాథులు లేక పూడిపోయినవి, పాడైపోయినవి, చెత్తకుండీలైనవి ఎన్నో.నిజానికి ఈ బావులన్నీ నీటివూటల ఆధారంగా తవ్వించినవే. ఈ బావులను బాగుచేయడమంటే పాతనీటివనరులను కొత్తగా అన్వేషించడమే.ఇట్లాంటి ఊటబావులను ఉద్ధరిస్తే అవి తాగునీటి కొరతను తీరుస్తాయి.లేదా వ్యవసాయబావులుగా వ్యవసాయానికి సాయమందిస్తాయి. వందలాదిగా వున్న మన రాష్ట్రపు బావులలో పునరుద్ధరణకు పనికొచ్చేవి ఎన్నున్నాయో మరి. అయితే మనరాష్ట్రంలో ఎన్నిరకాల మెట్లబావులెన్ని వున్నాయో లెక్కలు లేవు. చారిత్రక పరిశోధనలు జరుగలేదు. ఈ పనులన్నిటిని చేయడానికి పురావస్తుశాఖకు నిధుల కొరత, ఉద్యోగుల కొరత. ఈ విషయంలోనే కాదు, తెలంగాణా చరిత్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వానిదే పెద్దబాధ్యత. వరంగల్ లోని కాకతీయుల కోటకు సమీపంలో ఒక మెట్లబావుంది.దీర్ఘచతురస్రాకారంలో కట్టబడిన ఈ మెట్లబావికి దేవాలయ స్తంభాలు,అడ్డదూలాలతో నాలుగువైపుల మంటపాలు. మంటపాలనుండి కిందికి మెట్లదారులు.మూడు అంతస్తుల నిర్మాణం.కాకతీయుల కాలంలో కట్టబడిన ఈ మెట్లబావి కుతుబ్షాహీల కాలంలో తిరిగి కట్టినారడానికి సాక్ష్యమిచ్చే ఒక లఘుశాసనాన్ని మా టీమ్ చదివింది.దాంట్లో మిరాసీ ప్రస్తావన వుంది. కుతుబ్షాహీల కాలంలోని మిరాసీలు కాకతీయుల కాలంలో నాయంకరుల వంటి వారు.అక్కడ మరో స్తంభం మీద చెక్కివున్న ఏకపదశాసనంలో ‘మూలసంఘజీ’ పేరుంది. మెట్లబావికి అది మరో యజమాని పేరు కావచ్చు. కొత్తతెలంగాణా చరిత్రబృందం సందర్శించినపుడు మా సభ్యుడు అరవింద్ ఆర్య ఈ బావి గురించి పత్రికాముఖంగా తెలియజేసాడు. అప్పటినుండి అరవింద్ చేసిన ప్రయత్నాల మూలంగా ఇపుడా మెట్లబావి ఒక పర్యాటకప్రదేశంగా రూపుదిద్దుకుంటున్నది. ఇలాంటిదే ఇంతకన్నా గొప్ప నిర్మాణం కలిగిన మెట్లబావి పాతమెదక్ జిల్లా ఆందోల్ దగ్గర్లోని కిచ్చనపల్లిలో వుంది. నాలుగు మంటపాలు,మధ్యలో మంటపంతో బోర్లించిన పిరమిడ్ ఆకారంలో బావిమెట్లు. అందమైన శిల్పాలతో ఈ మెట్లబావి అపురూప నిర్మాణం. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని రాయగిరి రైల్వేస్టేషన్ కు ఉత్తరంగా వున్న మైదానంలో అద్భుతమైన చతురస్రాకారపు మెట్లబావి వుంది. ఎకరం నేలలో విస్తరించివుండే ఈబావి ఎదురుగా గుట్టమీదుండే వెంకటేశ్వరదేవాలయానికి పుష్కరిణి.రెండంతస్తులతో వుండే ఈ మెట్లబావి పటిష్టమైన నిర్మాణంతో వుంది.పూర్వం తిరుమలగిరి తండా అని పిలువబడే చోటనే ఇప్పటి రాయగిరి రైల్వేస్టేషన్ వుంది. అక్కడే అనుబంధ ఆలయాలు కూడా వున్నాయి. నిజామాబాద్ జిల్లా భిక్కనూరు క్షేత్రంలో మూడంతస్తుల మెట్లబావి వుంది.అత్యంత దృఢమైన నిర్మాణం.దీర్ఘచతురస్రాకారంలో కట్టించబడిన ఈ బావిని పునరుద్ధరిస్తే రామలింగేశ్వరాలయానికి శోభ తెస్తుంది. కామారెడ్డి జిల్లా లింగంపేటలో మెట్లబావుంది. దీనిని పాపన్నపేట సంస్థానాధీశుల ఆదేశాల మేరకు లింగంపేట జక్సానీ నాగయ్య కట్టించాడని స్థానిక కైఫీయతు. 18వ శతాబ్దంలో మూడేండ్లపాటు నిర్మించిన ఈ బావిని ఏనుగులబావి అని పిలిచేవారట. నాలుగు దారులున్న ఈ బావిలో చుట్టూరా కట్టిన 50గదులున్నాయి.అందమైన కళాకృతులున్న శిలలతో ఈ బావిని అలంకరించారు. భువనగిరిలో త్రిభువనమల్లుని కాలంలో మహాప్రధాన,దండనాయకులుగా తొలుత మల్లచమూపతి తర్వాత అతని కొడుకు విద్ధమయ్య భువనగిరి దుర్గాధిపతులైనారు. విద్ధమయ్య లేదా విద్ధమరసరు భువనగిరికి సమీపంలోని చందుపట్లగ్రామంలో విద్దేశ్వరస్వామిపేర శైవాలయాన్ని నిర్మించాడు. దేవాలయం వెనక కోనేరు తవ్వించి దానికి ‘విద్యాధరతీర్థమ’ని పేరుపెట్టాడు. శాసనం(క్రీ.శ.1115) వేయించాడు. తర్వాత కాలంతో విద్దేశ్వరాలయ సేవలకు చేసిన భూదానం చేసినట్లు రెండవ చందుపట్ల శాసనం(కాలం తెలియదు)తెలియజేస్తున్నది. భువనగిరిలో మసీదు మెట్లబావి, యాదాద్రిజిల్లాలోని మన్నెవారి తుర్కపల్లిలో వున్న మెట్లబావి, ఈ రెండు ఇస్లామిక్ శైలిలో నిర్మితమైన అందమైన మెట్లబావులు.తుర్కపల్లి మెట్లబావిలోని ఆర్చీలమీద నిజాంరాజ్య చిహ్నం వుండటం విశేషం. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల సమీపంలోని గంగాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి దేవాలయప్రాంగణంలోని పుష్కరిణి చక్కటి మెట్లబావికి మంచి ఉదాహరణ. సిద్ధిపేటజిల్లాలోని దుద్దెడ,గాలిపల్లిలలో చక్కని నిర్మాణాలతో మెట్లబావులున్నాయి. తెలంగాణాలో ఇటువంటి మెట్లబావుల్నివెతికి వాటి నిర్మాణాలను పరిశోధించడానికి, చరిత్ర రాయడానికి, ‘ది హైదరాబాద్‌ డిజైన్‌ ఫోరం’అధ్యక్షుడు ఆర్కిటెక్టు యశ్వంత్‌ రామమూర్తి ఆధ్వర్యంలో 15మంది ఔత్సాహిక ఆర్కిటెక్టులతో ఒక బృందం పనిచేస్తున్నది. తొలుత జే.ఎన్.టి.యు. విద్యార్థుల సహాయంతో రాష్ట్రంలోని మెట్లబావుల సర్వే చేపట్టారు.సొంతంగానే 70బావుల గురించి డాక్యుమెంటేషన్ చేసారు. మరో 30బావుల గురించి విషయసేకరణ చేస్తున్నారు.వాటిలో నుండి 30 మెట్లబావుల్ని ఎంపికచేసి, అవి ఎప్పటివో శాస్త్రీయంగా తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ ప్రక్రియను చేపడ్తున్నారు. గుజరాత్,రాజస్తాన్ లలోనే కాదు తెలంగాణాలో కూడా అక్కడి మెట్లబావులకు దీటైన బావులున్నాయని నిరూపించడానికి 100మెట్లబావుల విశేషాలతో,ఫోటోలతో ఒక కాఫీటేబుల్ బుక్ తేబోతున్నారు. ఇది తెలంగాణా చరిత్ర నిర్మాణంలో కొత్తకోణం.ఈ ఔత్సాహికులకు రాష్ట్రపురావస్తుశాఖ తనవంతు సహాయాన్ని అందిస్తున్నది. ఈ బృందం చేస్తున్న సర్వేలు,పరిశోధనలు తెలిసిన ఎన్.సాయికుమార్ అనే ఒక సామాజిక కార్యకర్త దేశప్రధాని కార్యాలయానికి రాసిన లేఖకు బదులుగా రాష్ట్రప్రభుత్వానికి వచ్చిన కేంద్రం ఆదేశాలతో రాష్ట్రపురావస్తుశాఖ మెట్లబావుల పరిరక్షణలో పడింది. వేయ్యేళ్ళ కిందట మెట్లబావులు మనకు ప్రాధమికావసరాలు. ప్రాంతీయపాలకులు సామాజిక శ్రేయస్సుకొరకు వాపీ, కూప, తటాకాలను నిర్మించారు. పదే,పదే కాకతీయులను తలచుకునేది వారు చేసిన యుద్ధాల కన్నా వారు తవ్వించిన చెరువులు, కట్టించిన మెట్లబావులను తలుచుకునే. వేలాది మెట్లబావులు నేడు పూడ్చివేయబడి ఆనవాళ్ళు లేకుండా పోయాయి. కొన్నిశిథిలదేవాలయాలతో పాటు చెత్తకుండీలైపోయాయి. కొన్ని నిరుపయోగంగా పడివున్నాయి. మెట్లబావులను వాటి జలవనరుల కొరకు, వాటి నిర్మాణంలోని సాటిలేని కౌశలానికి గౌరవించి, వాటిని మన వారసత్వసంపదలుగా గుర్తించాలి. కాపాడాలి. పునర్నిర్మాణం చెయ్యాలి. శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్,

                                                   
SATHYAM PATEL.OLAPU
Tags

Post a Comment

0 Comments