Type Here to Get Search Results !

సొంత జిల్లాకు ఉద్యోగులు

0
*💠సొంత జిల్లాకు ఉద్యోగులు*

*✍️స్థానికత ఆధారంగా విభజన*

*💥ఎస్టీ,ఎస్టీలు, భార్యాభర్తలకు ఆప్షన్‌*

*💫నెలాఖరులోగా శాశ్వత కేటాయింపులు*

*♻️నూతన జోనల్‌ విధానం ప్రకారం మార్పులు*

*🔰జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ పోస్టులుగా విభజన*

*✍️95 శాతం కొలువులు తెలంగాణ వారికే*

*📜84 ఉత్తర్వులు*

*⏺️నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌*
*సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల నెరవేరింది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆర్డర్‌ టు సర్వ్‌ పేరు మీద విధులు నిర్వహిస్తున్న వారు సొంత జిల్లాకు వెళ్లనున్నారు. అయితే ఉద్యోగులకు ఆప్షన్‌ ఇచ్చే అవకాశమున్నది. స్థానికతకు తొలి ప్రాధాన్యత ఉండనుంది. ఆ తర్వాత ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులు, భార్యాభర్తలకు ప్రాధాన్యత ఉంటుంది.*

*🔹ఖాళీలను బట్టి కోరుకున్న జిల్లాకు వెళ్లేందుకు అవకాశముంటుంది. స్థానికత, చదువు, నియామకం అయిన జిల్లా/జోనల్‌/మల్టీ జోనల్‌, ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా/జోనల్‌/మల్టీ జోనల్‌ ప్రకారం ఆప్షన్లు ఇస్తారు. ఖాళీలను బట్టి వారి ఆప్షన్ల ప్రచారం ఉద్యోగులను కేటాయిస్తారు. నూతన జోనల్‌ విధానానికి ఇటీవల రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అందుకనుగుణంగా జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టులుగా క్యాడర్‌ స్ట్రెంత్‌ విభజన కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ 84 జీవోలు (ఉత్తర్వులు) బుధవారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 2016, అక్టోబర్‌ 11న రాష్ట్రంలో 10 జిల్లాలను 31 జిల్లాలకు పెంచింది. ఆ తర్వాత ములుగు, నారాయణపేట జిల్లాలతో కలిపి ఆ సంఖ్య 33కు పెంచింది. ఉమ్మడి జిల్లాల్లో పనిచేసిన ఉద్యోగులను ఆర్డర్‌ టు సర్వ్‌ పేరుతో కొత్త జిల్లాలకు బదిలీ చేసింది. ఆర్నెల్లలోపు శాశ్వత కేటాయింపులు చేస్తామని ప్రకటించింది. భర్త ఒకచోట, భార్య మరోచోట విధులు నిర్వహించారు.*

 *🔸ఈ నిర్ణయం వల్ల భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే అవకాశమున్నది. ఈనెలాఖరులోగా ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. జిల్లాస్థాయి పోస్టుల విభజనకు ఆరు రోజులు, జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టుల విభజనకు మూడురోజుల చొప్పున కసరత్తు చేయాలని మార్గదర్శకాలు రూపొందించినట్టు తెలిసింది. ఆ తర్వాత ఉద్యోగుల శాశ్వత కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆ తర్వాతే ఏ జిల్లా, ఏ జోన్‌, ఏ మల్టీ జోన్‌లో ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయో నిర్దిష్టమైన వివరాలు తెలుస్తాయి. అప్పుడు కొత్త ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అవుతుంది. 95 శాతం కొలువులు స్థానికులకే దక్కనున్నాయి. అందుకనుగుణంగానే నూతన జోనల్‌ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. నియామకాలన్నీ జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించింది. ఇక రాష్ట్రస్థాయి పోస్టులన్నీ పదోన్నతుల ద్వారానే చేపట్టనుంది. గ్రూప్‌-1 - డిప్యూటీ కలెక్టర్‌, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, డీఎస్పీ, జిల్లా పంచాయతీరాజ్‌ అధికారి, జిల్లా రిజిస్ట్రార్‌, డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-1, ఆర్టీవో, ఎంపీడీవో పోస్టులన్నీ మల్టీ జోనల్‌లో ఉన్నాయి. జోనల్‌, జిల్లా క్యాడర్‌ పోస్టులనూ ప్రభుత్వం వర్గీకరించింది. అయితే పాఠశాల విద్యాశాఖకు చెందిన ఉపాధ్యాయ పోస్టుల విభజనకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ప్రత్యేకంగా ఉత్తర్వులు విడుదల చేసే అవకాశమున్నట్టు అధికారవర్గాల సమాచారం.*

*⭕స్థానికులకే ఉద్యోగాలు*

 *🔶కొత్త జోనల్‌ విధానం ప్రకారం ఇక నుంచి ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కనున్నాయి. 95 శాతం స్థానిక రిజర్వేషన్‌తో కొత్త జోనల్‌ విధానాన్ని ప్రభుత్వం తెచ్చింది. 5 శాతం ఉద్యోగాలను ఓపెన్‌ కోటా కింద చేపడతారు.*

*💥తాజా క్యాడర్‌ స్ట్రెంత్‌ ప్రకారం..*

*💢జిల్లా పోస్టులు : టైపిస్టు, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ స్టెనో, డ్రైవర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, రెనో ఆపరేటర్‌, జమేదార్‌, చైన్‌మెన్‌, డఫేదార్‌, కుక్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, శానిటరీ వర్కర్‌, స్వీపర్‌, వాచ్‌మెన్‌, ఫోర్‌మెన్‌, కార్పెంటర్‌, మేస్త్రీ, గార్డెనర్‌, మిలిమాలన్‌, చౌకీదార్‌, ప్రింటింగ్‌ టెక్నీషియన్‌, కానిస్టేబుల్‌, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-4 తదితర పోస్టులు.*

*💢జోనల్‌ పోస్టులు : నాయిబ్‌ తహసీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఎంఆర్‌ఐ, ఏఆర్‌ఐ, సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, సూపరింటెండెంట్‌, నాన్‌టెక్నికల్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, హెడ్‌ కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, సీనియర్‌ డ్రైవర్‌, అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-1,2,3, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2, తదితర పోస్టులు.*

*💢మల్టీ జోనల్‌ పోస్టులు : డిప్యూటీ కలెక్టర్‌/ ఆర్డీవో, అసిస్టెంట్‌ సెక్రెటరీ, సూపరింటెండెంట్‌, తహసీల్దార్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, సీఐ, డీఎస్పీ, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1, 2, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, హెల్త్‌ ఇన్‌స్ట్రక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్‌ పంచాయతీ ఆఫీసర్‌, ఎంపీడీవో, మండల పంచాయతీ అధికారి, అగ్రికల్చర్‌ అధికారి, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-1, డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2,3 తదితర అధికారులు.*
Tags

Post a Comment

0 Comments